అద్దె చెల్లించలేదని బస్టాండ్ ను మూసేశారు

అద్దె చెల్లించలేదని బస్టాండ్ ను మూసేశారు

కడప జిల్లా :  నగరపాలక సంస్థకు అద్దె చెల్లించలేదనే కారణంతో  అధికారులు కడప పాత బస్టాండ్​ను మూసేశారు. దీంతో బస్సులు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కడప పాత బస్టాండ్​ను నగరపాలక అధికారులు నిర్మించారు. అక్కడ ఆర్టీసీ బస్సులను పార్కింగ్ చేసేందుకు ప్రతినెల ఆర్టీసీ అధికారులు.. నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తారు.

అయితే 2013 నుంచి ఆర్టీసీ అధికారులు .. నగరపాలక సంస్థకు రెండు కోట్లు బకాయిలను చెల్లించలేదని కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీనిపై ఆర్టీసీ అధికారులకు నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి  స్పందన లేదన్నారు. ఇక చేసేది లేక బస్సులను బస్డా్ండ్ లోకి పంపకుండా ఉదయం బస్టాండును మూసేశామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.