కాంగ్రెస్​లోకి కడెం జడ్పీటీసీ

కాంగ్రెస్​లోకి కడెం జడ్పీటీసీ

కడెం, వెలుగు: బీఆర్​ఎస్​కు చెందిన కడెం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డితోపాటు లక్ష్మీపూర్ గ్రామ మాజీ సర్పంచ్ విజయ్ రాజన్న  కాంగ్రెస్ లో చేరారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అదివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో వారు కాంగ్రెస్ ​కండువాలు కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు వెంకటేశ్, మాజీ సర్పంచ్ లచ్చన్న, నాయకులు పడిగెల భూషణ్, రాజేశ్వర్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.