
దళితబంధు అమలు చేయకపోతే నష్టం టీఆర్ఎస్‌కేనన్నారు మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి. పథకం అమలు చేయకపోతే దళితుల వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అందరికీ దళిత బంధు ఇవ్వకపోతే.. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు కడియం. ఏడేళ్లుగా ఎమీ చేయకుండా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దష్పప్రచారాం చేయడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం దళితబంధు రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రం గణనీయమైన అభివృద్ది, తలసరి ఆధాయం, తలసరి విద్యుత్ వినియోగం పెరిగినా.. పంటల దిగుబడి పెరిగినా ఇంకా అనేక కుటుంబాల్లో పేదరికం ఉందన్నారు.