V6 News

కాంగ్రెస్‌‌ ఎంపీలపై కేసీఆర్‌‌ వ్యాఖ్యలు సరికాదు : వరంగల్‌‌ ఎంపీ కడియం కావ్య

 కాంగ్రెస్‌‌ ఎంపీలపై కేసీఆర్‌‌ వ్యాఖ్యలు సరికాదు : వరంగల్‌‌ ఎంపీ కడియం కావ్య
  • తేజస్వి సూర్య వ్యాఖ్యలను పార్లమెంట్‌‌లోనే ఖండించాం : వరంగల్‌‌ ఎంపీ కడియం కావ్య

వరంగల్, వెలుగు : తెలంగాణ కాంగ్రెస్‌‌ ఎంపీల పట్ల మాజీ సీఎం కేసీఆర్‌‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వరంగల్‌‌ ఎంపీ కడియం కావ్య అన్నారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తాను పార్లమెంట్‌‌లోనే ఖండించానని గుర్తుచేశారు. సూర్య చేసిన వ్యాఖ్యలపై నిలదీయడమే కాకుండా.. ఆ వ్యాఖ్యలను తొలగించాలని సైతం డిమాండ్‌‌ చేసినట్లు చెప్పారు.

తెలంగాణ విభజన అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ముక్తకంఠంతో ఖండించడంతో.. కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. పదేండ్లు సీఎం చేసిన కేసీఆర్‌‌ ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడడం తగదన్నారు. కేసీఆర్‌‌ నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.