
ధర్మసాగర్, వెలుగు: కల్యాణలక్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డ తల్లిదండ్రులకు వరంగా మారిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వేలేరు మండలానికి చెందిన 17మంది, ధర్మసాగర్ మండలానికి చెందిన 71మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఆయా రైతువేదికల్లో ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే బిల్లులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో అని కుమార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.