పరిగి, వెలుగు: కాడ్లాపూర్ఇండస్ట్రియల్ భూ బాధిత రైతులు పట్టువీడకుండా ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పల మహేశ్రెడ్డితోపాటు కొంతమంది బీఆర్ఎస్నాయకులను పోలీసులు రంగాపూర్వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో నాయకులు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. మహేశ్‌రెడ్డిని బలవంతంగా చెన్గోముల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్నాయకుల తీరు రైతులను రెచ్చగొట్టేలా ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే వారిని అరెస్ట్‌చేసినట్లు పోలీస్అధికారులు తెలిపారు.
‘నేను రైతుల వద్దకు వెళ్లడం లేదు, ఎక్కడికీ రాను.. ఇంటికి వెళ్లొద్దా? కావాలంటే బండి ఎక్కండి.. నా ఇంటి వద్ద మనుషులను పెట్టండి’ అంటూ మహేశ్‌రెడ్డి పోలీసులతో గొడవకు దిగారు.
