డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి : ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి : ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి

కాగజ్ నగర్, వెలుగు: ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు డిగ్రీలో చేరడానికి ఈ నెల 21 లోపు దోస్త్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి సూచించారు. కాలేజీలో ఏర్పాటు చేసిన ఉచిత సేవా కేంద్రంలో కానీ మీసేవా కేంద్రం నుంచి గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

 ప్రస్తుతం డిగ్రీ కాలేజీల్లో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 3 నుంచి మొదలైనట్లు తెలిపారు. కాగజ్‌నగర్‌ డిగ్రీ కాలేజీలో బీఏ, బీకాం(కంప్యూటర్స్), బీఎస్సీ(జనరల్), బీఎస్సీ కంప్యూటర్స్, బీజడ్సీ గ్రూపుల్లో మొత్తం 840 సీట్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఇతర వివరాలకు 7013607011, 9440194179 నంబర్లలో సంప్రదించాలని కోరారు.