
ఐపీఎల్ సీజన్ 13 ఫైనల్ పోరు రేపు జరగనుంది. తొలిసారి ఫైనల్ కు వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్ డిఫెండింగ్ చాంఫియన్ ముంబైతో ఢీ కొట్టనుంది. అయితే అందరి దృష్టి ఆరెంజ్ ,పర్పుల్ క్యాప్ లపై పడింది. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు తీసిన బ్యాట్స్ మెన్ కు ఆరెంజ్ క్యాప్ .. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ పర్పుల్ క్యాప్ ఇస్తారు. ఇప్పటి వరకు అత్యధిక రన్స్ చేసిన జాబితాలో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (670) పరుగులతో ఫస్ట్ ప్లేసులో ఉన్నారు. ఆ తర్వాత 603 రన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున శిఖర్ ధావన్ ఉన్నాడు. రాహుల్ మ్యాచ్ లు ఆడే చాన్స్ లేదు. ఇక ధావన్ రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఇంకా 68 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్ ధావన్ సొంతమవుతుంది. ఇక ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల రేసులో కగిసో రబాడా( ఢిల్లీ క్యాపిటల్స్ ) 29 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఆతర్వాత ముంబై ఇండియన్స్ టాప్ బౌలర్ జస్పిత్ బుమ్రా 27 వికెట్లతో సెకండ్ ఉన్నాడు. వీరిద్దరు రేపు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇద్దరిలో ఎవరు పర్పుల్ క్యాప్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.