
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీకళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. మొదటి సినిమా సరిగా ఆడకపోయినా.. వరుస అవకాశాలు అందిపుచ్చుకొని టాప్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు,హిందీ,తమిళ్.. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది ఈ బ్యూటీ.
ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లైన కాజల్. ఆతరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మిగిలిన సీనియర్ హీరోయిన్లతో పోలిస్తే ఈ పంజాబీ అందం మంచి ఆఫర్లనే అందుకుంటుంది. ప్రస్తుతం బాలకృష్ణతో 108వ సినిమాలో చేస్తున్న ఈ బ్యూటీ.. తమిళంలో భారతీయుడు 2తో పాటు.. మరో సినిమాలోనూ నటిస్తోంది.
మరో వైపు ఓ బాలీవుడ్ సినిమాలోనూ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో విలువల్లేవని, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ తర్వాత కూడా అక్కడ అవకాశాలు అందుకోవడం విశేషమనే చెప్పాలి.