లేడీ డాన్‌గా కాజల్ అగర్వాల్.. విశాఖ వెబ్ సిరీస్‌తో నెక్ట్స్ లెవెల్ యాక్షన్!

లేడీ డాన్‌గా కాజల్ అగర్వాల్.. విశాఖ వెబ్ సిరీస్‌తో నెక్ట్స్ లెవెల్ యాక్షన్!

రెండేళ్ల క్రితం వచ్చిన 'సత్యభామ' తర్వాత 'కన్నప్ప'లో క్యామియో చేసిన కాజల్ అగర్వాల్ మళ్లీ బిజీ అవుతోంది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో ఆమె ఫిమేల్ లీడ్ గా నటి స్తోంది. అలాగే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. 'స్వామిరారా' చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో 'విశాఖ' పేరుతో యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్  రూపొందుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. గ్యాంగ్ స్టర్ గా  అలాగే సాధారణ గృహిణిగా ఆమె పాత్ర సాగనుందని తెలుస్తోంది. లేడీ డాన్ గా కనిపించే ఆమె పాత్రలో యాక్షన్ ఎపిసోడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట.

ఈ సిరీస్కు సంబంధించిన తన పోర్టన్ షూట్ రీసెంట్గా కాజల్ పూర్తిచేసింది. హిందీలో సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఆర్య' వెబ్ సిరీస్ కు  'విశాఖ' తెలుగు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. జులై లేదా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. వెబ్సై రీస్ తో పాటు సినిమాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న కాజల్ అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను అలరించేందుకు సి ద్ధమవుతుంది.