Kajal Agarwal: కేరవాన్‌లో ఒంటరిగా ఉంటే సడన్గా వచ్చి షర్ట్ విప్పాడు.. చాలా భయమేసింది

Kajal Agarwal: కేరవాన్‌లో ఒంటరిగా ఉంటే సడన్గా వచ్చి షర్ట్ విప్పాడు.. చాలా భయమేసింది

సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్(kajal Agarwal) చాలా గ్యాప్ తరువాత సోలో హీరోయిన్ గా చేస్తున్న సినిమా సత్యభామ(Satyabhama). కొత్త దర్శకుడు సుమన్ చిక్కాల(Suman Chikkala) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను క్షణం, గూఢచారి చిత్రాల దర్శకుడు శశి కిరణ్ టిక్కా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కూడా క్రైం, థ్రిల్లర్ గా వస్తుండటంతో.. అందుకే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నారు. టీజర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తనకు జరిగిన ఒక వింత సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..కొన్నేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. షూటింగ్ అయ్యాక నా కేరవాన్‌కి వెళ్లాను. ఇంతలో.. ఆ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా చేస్తున్న ఓ వ్యక్తి అనుమతి లేకుండా లోపలి వచ్చి తన షర్ట్ విప్పేసాడు. అది చూసి నాకు చాలా భయమేసింది. అయితే ఆ వ్యక్తి షర్ట్ విప్పింది తన గుండెలపై నా పేరును పచ్చబొట్టు వేయించుకున్నానని చూపించడానికి. కానీ, ఆ టైంలో చాలా భయమేసింది. అతను నాపై అభిమానం చూపించడం నాకు ఆనందం కలిగించింది కానీ.. ఒంటరిగా వున్నప్పుడు వచ్చి అలా ప్రవర్తించడం మాత్రం నచ్చలేదు. అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.