
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఘోస్టీ చిత్రం ప్రేక్షకుల ముందు రాబోతుంది. గతేడాది రిలీజ్ కావాల్సి ఈ మూవీ.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 17న ఈ చిత్రం థియేటర్స్‌లోకి రాబోతోంది. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ డ్యూయల్ రోల్లో కనిపిస్తోందని తెలుస్తోంది. ఒక పాత్రలో పోలీస్‌గా, మరోటి సినీ నటి క్యారెక్టర్లో కనిపించనుందట. డ్యూయల్ రోల్ చేయడం కాజల్‌కు ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, యోగి బాబు, కేఎస్ రవికుమార్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సీడ్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలావుండగా.. ప్రస్తుతం శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ 2లో కాజల్ నటిస్తోంది. మరోవైపు హిందీలో ఉమ ప్రాజెక్టులో నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో మరో సినిమా చేస్తోంది. ఈ బ్యూటీ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది.