
పెళ్లి తరువాత సినిమాలు తగ్గించిన కాజల్ అగర్వాల్(Kajal Agarwal) ప్రస్తుతం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత ఆమె సత్యభామ(Satyabhama) అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. కాజల్ పోలీస్ ఆఫిసర్ గా చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు సుమన్ చిక్కాలా(Suman Chikkala) తెరకెక్కిస్తున్నారు.
Gear up to celebrate 'The Queen of Masses' @MSKajalAggarwal like never before on the big screens ❤️?❤️?#Satyabhama in theatres worldwide on May 17th ?
— Aurum Arts Official (@AurumArtsOffl) April 22, 2024
▶️ https://t.co/TbBMJ0g6QY@MSKajalAggarwal @Naveenc212 @AurumArtsoffl @sumanchikkala @sashitikka @SriCharanpakala @bobytikka… pic.twitter.com/svK00yfv0y
చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను మే 17న థియేటర్స్ లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో కాజల్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వవీడియో ఆడియన్స్ ను వేపరితంగా ఆకట్టుకుంది. ఆ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే స్టిల్స్ అండ్ పోస్టర్స్ కూడా ఉండటంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మరి పెళ్లి తరువాత కాజల్ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.