గణేష్ చతుర్థి వేడుకల్లో నటి కాజోల్

గణేష్ చతుర్థి వేడుకల్లో నటి కాజోల్

దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముంబైలోని లాల్‌బాగ్చా రాజా.. ఐకానిక్ గణేష్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచాడు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఐకానిక్ గణేషున్ని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ దేవగన్ గణపతిని దర్శించుకొని పూజలు చేశారు. బంగారు వర్ణం చిర కట్టుకొని ఆమె సాంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు. కాజోల్ ఖరీదైన నెక్లెస్ ధరించిన.. ఆకుపచ్చని గాజులు వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ చూడముచ్చటగా ఉన్నారు. శారీ లుక్ లో ఉన్న ఫోటోలు కాజోల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

గణేష్ చతుర్థి విషయానికి వస్తే.. ముంబైలో లాల్‌బాగ్చా రాజా ఐకానిక్ గణేష్ విగ్రహం ఎంతో ప్రత్యేకం. ఈ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతీ సంవత్సరం ఇక్కడ వినినాయ చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు సందడి చేస్తుంటారు.