చెన్నూరులో మందమర్రి టైగర్స్ టాపర్.. కాకా క్రికెట్ టోర్నీ

చెన్నూరులో మందమర్రి టైగర్స్ టాపర్.. కాకా క్రికెట్ టోర్నీ

కోల్​బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి స్మారక చెన్నూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల్లో ‘మందమర్రి టైగర్స్’​ టీమ్ 10 పాయింట్లతో టేబుల్ టాపర్​గా నిలిచింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​సింగరేణి ఠాగూర్​స్టేడియంలో మంగళవారం ఉదయం మందమర్రి టైగర్స్, కోటపల్లి టైగర్స్​జట్లు తలపడ్డాయి. టాస్​గెలిచి మొదట బ్యాటింగ్​చేసిన మందమర్రి టైగర్స్ టీమ్​15 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 193 రన్స్ స్కోర్ చేసింది.

భార్గవ్ 20 బాల్స్​లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 43 రన్స్, జి.రమేశ్​యాదవ్​21 బాల్స్​లో 8 ఫోర్లతో 36 రన్స్, శశి 21 బాల్స్​లో 5 ఫోర్లు, సిక్స్​తో 32 రన్స్ చేశారు. చేజింగ్​లో కోటపల్లి టైగర్స్​బ్యాటర్లు 15 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 64 రన్స్ కే పరిమితమ్యారు. మందమర్రి టైగర్స్ కు చెందిన జి.రమేశ్​యాదవ్ 26 రన్స్​చేయడంతోపాటు, రెండు వికెట్లు పడకొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు. 

రెండు మ్యాచుల్లో ‘చెన్నూరు టైగర్స్’దే గెలుపు

మధ్యాహ్నం చెన్నూర్ టైగర్స్ టీమ్ ​రెండు మ్యాచ్​లు ఆడగా, రెండింటిలోనూ విజయం సాధించింది. ముందుగా భీమారం, చెన్నూరు టైగర్స్ ఆడగా, ఫస్ట్​బ్యాటింగ్​చేసిన భీమారం టీమ్​ఏడు వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసింది. ధరన్ 43 బాల్స్​లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 55 రన్స్ చేశాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన చెన్నూరు టైగర్స్ ఓపెనర్లే టార్గెట్​చేజ్​చేశారు.13.3 ఓవర్లలో 128 రన్స్​కొట్టి టీమ్​ను గెలిపించారు. రాజశేఖర్​రెడ్డి 37 బాల్స్​లో 8 ఫోర్లు, ఒక సిక్సుతో 64 రన్స్ చేయడంతో పాటు ఒక వికెట్​ తీయడంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’​గా నిలిచాడు.

మరో బ్యాటర్​మీర్జా ఆదిద్ అహ్మద్ 44 బాల్స్​లో 8 ఫోర్లతో 59 రన్స్ చేశాడు. తర్వాత రామకృష్ణాపూర్​క్రికెట్​క్లబ్ టీమ్​తో మరో మ్యాచ్​ఆడిన చెన్నూరు టైగర్స్, మొదట బ్యాటింగ్​చేసి 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 రన్స్ స్కోర్​చేసింది. చేజింగ్​లో రామకృష్ణాపూర్​టీమ్​15 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 89 రన్స్ కే పరిమితమైంది. చెన్నూరు ప్లేయర్​ఇబ్రహీం షరీఫ్​21 రన్స్ చేయడంతో పాటు3 వికెట్ల పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు.