పేద కుటుంబానికి కాకా ఫౌండేషన్ సాయం

పేద కుటుంబానికి కాకా ఫౌండేషన్ సాయం

అనారోగ్యంతో బాధపడుతున్నపేద కుటుంబానికి చెందిన వ్యక్తికి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి సాయం అందించి పెద్దమనసు చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి  మండలంలోని నాయికినిపేట గ్రామానికి చెందిన ఓడేటి హనుమంతు.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మంచిర్యాలలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి కాకా ఫౌండేషన్ ద్వారా రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. నిరుపేద  కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పారు.

వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో.. గొల్లపల్లి ఎంపీటీసీ, మంచిర్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బొమ్మెన హరీష్ గౌడ్.. హాస్పిటల్ కు వెళ్లి హనుమంతును పరామర్శించారు. అనంతరం అతడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంచిర్యాల జిల్లాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలతో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ తీశారు గద్దెరాగడి నుంచి మందమర్రి లోని జయశంకర్ చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.