పేదలకు అండగా కాకా ఫౌండేషన్

పేదలకు అండగా కాకా ఫౌండేషన్
  • వంద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

జైపూర్/భీమారం, వెలుగు: లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పలు గ్రామాల్లో వంద నిరుపేద కుటుంబాలకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్​ వెరబల్లి రఘునాథ్, జనరల్ సెక్రెటరీ అందుగుల శ్రీనివాస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్​ మాట్లాడుతూ మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ ​కమిటీ సభ్యులు డాక్టర్. వివేక్ వెంకటస్వామి సూచనల మేరకు బుధవారం నిత్యావసర సరుకులను అందించినట్టు చెప్పారు. అందుగుల శ్రీనివాస్  మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, కరోన బారిన పడినవారు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో ఐసోలేషన్ సెంటర్​ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ వేల్పుల శ్రీనివాస్, జిల్లా యువమోర్చా ప్రెసిడెంట్ పట్టి వెంకట కృష్ణ, బీజేపీ లీడర్లు బొల్లం చంద్రమౌళి, మధుకర్, వడ్లకొండ పవన్, దుర్గం సంతోషి మాత తదితరులు పాల్గొన్నారు.

నెన్నెల మండలంలో..
వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెన్నెల మండలంలోని నెన్నెల, లంబడితండాలో కొవిడ్-19 బాధితులకు  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి హరీశ్​గౌడ్​ మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజలకు ఫౌండేషన్ ద్వారా వివేక్ వెంకటస్వామి ఎల్లప్పుడూ సేవలు అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నెన్నెల గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఉప సర్పంచ్ అంజన్న, యువకులు పాల్గొన్నారు.