ఢిల్లీలో ఘనంగా కాకా జయంతి వేడుకలు

ఢిల్లీలో ఘనంగా కాకా జయంతి వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి, కార్మిక నేత జి. వెంకట స్వామి(కాకా) జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సోమవారం తెలంగాణ భవన్‎లోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది, కాకా ఫాలోవర్స్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం భవన్ ఉద్యోగులు, కాకా అభిమానులు పూలు వేసి స్మరించుకున్నారు.  కేంద్ర మంత్రిగా, తెలంగాణ ఉద్యమ నేతగా కాకా చేసిన పనులను పలువురు గుర్తు చేసుకున్నారు.