సింగరేణిని కాపాడింది కాకానే: వర్థంతి సభలో నేతలు

సింగరేణిని కాపాడింది కాకానే: వర్థంతి సభలో నేతలు

సింగరేణిని కాపాడింది కాకా వెంకటస్వామినే అని.. ఆయన వర్థంతి సందర్భంగా ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు కాసీపేట కాంగ్రస్ పార్టీనేతలు. సింగరేణి కార్మికులకు పెన్షన్ స్కీం, సంస్థను ఆదుకున్న గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి అని అన్నారు. వివేక్ అన్న యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 

దళితుల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి కాకా వెంకటస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని కాసీంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నివాళులర్పించారు. కేంద్రమంత్రిగా కాకా ఉన్నప్పుడు సింగరేణి సంస్థ  నష్టాల్లో ఉంటే ఆదుకున్నారని.. సింగరేణి కార్మికులకు పెన్షన్ స్కీం ను తెప్పించారని వివేక్ అన్న యువసేన స్టేట్ ప్రెసిడెంట్ రత్నం శ్రీనివాస్ అన్నారు.

కాకా వెంకటస్వామి 9వ వర్థంతి సేవాకార్యక్రమాల్లో వివేక్ అన్న యువసేన స్టేట్ ప్రెసిడెంట్ రత్నం శ్రీనివాస్, INTUC నాయకులు రాపర్తి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, మాజీపీఏసీఎస్ చైర్మన్ పుస్కూరి వంశీధర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధం తిరుపతి , నస్పూరి నర్సింగం ఉత్తూరి సత్తయ్య  సామల లక్ష్మణ్ సిద్ధం రాములు గోదార్ల శంకర్ మేడ చంద్రయ్య సిద్ధం బాపు బొడ్డు శంకర్ గోనె శ్రీధర్ పాల్గొన్నారు.