V6 News

ప్రతి ఆవిష్కరణ, సృజన మానవాభివృద్ధికి దోహదపడాలి

 ప్రతి ఆవిష్కరణ, సృజన మానవాభివృద్ధికి దోహదపడాలి
  • కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం
  • వర్సిటీలో ముగిసిన నోబెల్ ప్రైజ్ డే  సెలబ్రేషన్స్ 

హసన్ పర్తి,వెలుగు : ప్రతి ఆవిష్కరణ, సృజన మానవాభివృద్ధి దోహదపడాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం పేర్కొన్నారు.  వర్సిటీలోని సెనేట్ హాల్ లో  స్టూడెంట్ అఫైర్స్ డీన్ ఆధ్వర్యంలో  రెండు రోజుల ‘ నోబెల్ ప్రైజ్ డే సంబురాలు’ బుధవారం ముగిశాయి. కార్యక్రమానికి రిజిస్ట్రార్ రామచంద్రం హాజరై   మాట్లాడుతూ.. వర్సిటీ విద్యార్థుల అకాడమిక్ స్పిరిట్ ఎంతో గొప్పదన్నారు. విద్యార్థుల జిజ్ఞాసను బహిర్గతం చేయడం ద్వారా ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనవచ్చన్నారు. 

విద్యార్థుల మేధస్సే  ఐడియాలకు పునాది అని పేర్కొన్నారు. వర్సిటీ గోల్డెన్ జూబ్లి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అధ్యాపకుల కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొ. మామిడాల ఇస్తారి, ఆయా విభాగాల అధిపతులు, ఫ్యాకల్టీ కో – ఆర్డినేటర్లు పాల్గొన్నారు.