- ప్రొఫెసర్ వెంకటరమణ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలను తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, సీపీగెట్ కన్వీనర్ ఓయూ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డితో పాటు ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారిని ప్రభుత్వం నియమించింది.
అడ్మిషన్లపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీలో ఆరేండ్ల తర్వాత 212 పీహెచ్‌డీ అడ్మిషన్లను నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, వీటిని కొందరు ఆఫీసర్లు అమ్ముకున్నారని, రూల్స్‌కు విరుద్ధంగా సీట్లు భర్తీ చేశారని స్టూడెంట్లు గతేడాది 40 రోజులు దీక్ష చేశారు. ఈ క్రమంలో అప్పటి మంత్రి కేటీఆర్ స్పందించి, విచారణ జరిపి స్తామని హామీ ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. ఇదే సమ యంలో దీక్షా శిబిరాన్ని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి సందర్శించి.. స్టూడెంట్లకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి రావడంతో, పీహెచ్‌డీ అడ్మిషన్లలో జరిగిన
అవకతవకలను వెలికితీసేందుకు చర్యలు మొదలుపెట్టింది.
