సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం..ఎంపీ పేరు చెప్పి రూ.92 లక్షల కాజేశారు

సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం..ఎంపీ పేరు చెప్పి రూ.92 లక్షల కాజేశారు

సైబర్ నేరాలు.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాంతోపాటే పెరుగుతున్న సైబర్ మోసాలు..రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ ఫ్రాడస్టర్లు అమాయకుల జేబులు ఖాళీ చేస్తున్నారు. సెలబ్రిటీలనుంచి, రాజకీయ ప్రముఖులనుంచి సాధారణ ప్రజలవరకు  ఎవ్వరీని వదలడం లేదు.. తాజాగా ఏపీకి చెందిన ఓ ఎంపీపేరు చెప్పి అతని  సిబ్బందిని బురిడి కొట్టించారు. వివరాల్లోకి వెళితే.. 

అమరావతి: కాకినాడ ఎంపీ టీ టైమ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారంలో కీలక అధికారి (CFO) శ్రీనివాసులునుంచి  సైబర్ నేరగాళ్లు రూ.92 లక్షలు టోకరా వేశారు. కాకినాడ ఎంపీ డీపీని తమ వాట్సాప్ నెంబర్‌కు పెట్టుకుని,ఎంపీ పేరు చెప్పి అతని CFO శ్రీనివాసులుకు మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టారు. ఎంపీ అత్యవసరంగా డబ్బు అవసరం అని అడిగారని నమ్మించారు.

డబ్బు ఇలా కాజేశారు.. 

సైబర్ నేరగాళ్లు ఈ మెసేజ్‌ల ద్వారా ఏకంగా 11 సార్లు శ్రీనివాసులు నుంచి డబ్బులు వసూలు చేశారు. ఎంపీ పేరు ఉపయోగించుకుని దఫాలుగా శ్రీనివాసులు నుంచి మొత్తం రూ.92 లక్షలు దోచుకున్నారు.  శ్రీనివాసులు కూడా ఎంపీ స్వయంగా అడిగారని నమ్మి, ఎలాంటి అనుమానం లేకుండా డబ్బును సైబర్ నేరగాళ్లకు పంపించారు.

మోసం ఎలా బయటపడిందంటే.. 

ఇటీవల ఓ సందర్భంలో శ్రీనివాసులు,ఎంపీ ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఈ మోసం బయటపడింది. శ్రీనివాసులు ఎంపీతో మీరు అడిగిన డబ్బు పంపించాను కదా అది సరిపోతుందా? అని అడిగారు.

►ALSO READ | తెలంగాణలో విషాదం.. పిడుగులు పడి ఒకే రోజు ఆరుగురు మృతి

దీనితో ఎంపీ ఆశ్చర్యపోయి తాను అలాంటి డబ్బులు ఏమీ అడగలేదని చెప్పడంతో మోసం బయటపడింది. మోసపోయానని గ్రహించిన శ్రీనివాసులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొత్త టెక్నిక్స్‌, టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు మోసగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల కాలంలో వాట్పాప్, ఫేస్ బుక్ ల ద్వారా డబ్బులు అడుగుతున్న మోసాలు బాగా పెరిగిపోయాయి. వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా మాత్రమే నమ్మకుండా, స్వయంగా ఫోన్ చేసి నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి మోసాలను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోలీసులు.