
హైదరాబాద్, వెలుగు: కల్ బర్డ్ సింగిల్ విండో - 5 రీజియన్స్ భవనాన్ని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ (టీపీఎఫ్) ఆదివారం అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. నల్గొండ మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, టీపీఎఫ్ అధ్యక్షుడు కాసర్ల మోహన్ రెడ్డి, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బాయాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. విద్యుత్ సబ్సిడి, రైతులు నిర్మించే షెడ్ పర్మిషన్ విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం టీపీఎఫ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ఈ భవనం కేవలం ఓ మౌలిక సదుపాయమే కాక అభివృద్ధికి, ఫెడరేషన్ పౌల్ట్రీ రైతులను శక్తివంతం చేయాలన్న అంకితభావానికి ప్రతీక అని అన్నారు.