సీజనల్ వ్యాధులపై కళాజాతా

సీజనల్ వ్యాధులపై కళాజాతా

ములకలపల్లి, వెలుగు :  మంగపేట పీహెచ్​సీ వద్ద బుధవారం సీజనల్ వ్యాధులపై కళాజాతా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కార్యక్రమం నిర్వహించారు.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున అందరూ శుభ్రత పాటించాలని సూచించారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ దీపక్ రెడ్డి, హెచ్ ఈవో  సీత, కళాకారుల టీం సభ్యులు పాల్గొన్నారు.