
మంచిర్యాల, వెలుగు: చండీగఢ్ లో జరిగిన సీపీఐ 25వ జాతీయ మహాసభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ ను జాతీయ కౌన్సిల్ సభ్యుడుగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో అనేక పదవులు నిర్వహించారు. జాతీయ సమితి సభ్యుడుగా ఎన్నికైన సందర్భంగా పార్టీ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ మేకల దాసు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.