వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణలక్ష్మీ, CMRFచెక్కులు పంచిన అసెంబ్లీ స్పీకర్..

వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణలక్ష్మీ, CMRFచెక్కులు పంచిన అసెంబ్లీ స్పీకర్..

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ అందజేశారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆరుగురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వికారాబాద్​ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు రాజశేఖర్​రెడ్డి, ఆర్​టీఏ మెంబర్​ ఎర్రవల్లి జాఫర్​, మాజీ జడ్పీటీసీ మహిపాల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.