తెలంగాణను ఢిల్లీ పార్టీల చేతుల్లో పెట్టొద్దు : కాలె యాదయ్య

తెలంగాణను ఢిల్లీ పార్టీల చేతుల్లో పెట్టొద్దు :  కాలె యాదయ్య

చేవెళ్ల, వెలుగు : తెలంగాణను మళ్లీ ఢిల్లీ చేతిలో పెడితే గల్లీలో పోరాటాలు చేయకతప్పదని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని సింగప్పగూడ, మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం, సురంగల్, శ్రీరామ్ నగర్, వెంకటాపూర్, కేతిరెడ్డి పల్లి, చాకలిగూడ గ్రామాల్లో ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర చేట్టారు. చేవెళ్ల సెగ్మెంట్ ఇన్ చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు.

 ఈ సందర్భంగా కాలె యాదయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కేసీఆర్ బీమాతో రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందున్నారు. చేవెళ్ల సెగ్మెంట్ లోని 5 మండలాల్లో ఉన్న 175 గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల్లో యాదయ్య తరఫున చేవెళ్ల, శంకర్​పల్లి, షాబాద్

మొయినాబాద్, నవాబ్​పేట ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.  బీఆర్​ఎస్​ మండల అధ్యక్షుడు ప్రభాకర్​ యాదవ్​,ఎంపీపీ విజయలక్ష్మీ , జడ్పీటీసీ మాలతి  తదితరులు పాల్గొన్నారు.