బాధిత కుటుంబాలకు ఎంపీ వంశీకృష్ణ పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎంపీ వంశీకృష్ణ పరామర్శ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ మాజీ​చైర్మన్ మంగీలాల్​ సోమాని కుటుంబాన్ని మంగళవారం ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. మంగీలాల్​సోమాని సతీమణి శ్రీకాంత సోమాని అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న ఎంపీ వారి ఇంటికి వెళ్లారు. 

ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పరిచయస్థుడైన డ్రైవర్​గొల్లపల్లి శంకర్ తల్లి రాజమ్మ ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎంపీ ఆమె భౌతికకాయానికి నివాళిఅర్పించారు. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.