- బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులాచారి
బోధన్, వెలుగు: బోధన్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులాచారి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ ఆఫీస్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పదేండ్ల కాలంలో బీఆర్ఎస్, రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రాంచందర్, ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ పిల్లి శ్రీకాంత్, బోధన్ పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపి కిషన్, మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపురం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ డివిజన్ఆఫీస్ను తరలించొద్దని కలెక్టర్‌కు వినతి
నిజామాబాద్ రూరల్: డిచ్పల్లి మండల కేంద్రంలోని విద్యుత్‌శాఖ సబ్ డివిజన్ ఆఫీస్‌ను తరలించవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏండ్లుగా డిచ్‌పల్లిలో కొనసాగుతున్న ఆఫీస్ డిచ్‌పల్లితో పాటు ఇందల్వాయి మండల ప్రజలు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. సొంత భవనం లేదనే సాకుతో ఆఫీస్‌ను ఇందూరు నగరంలోకి మార్చడం వల్ల ఈ ప్రాంత రైతులు ఇబ్బందులు పడతారని తెలిపారు.
