కారు పార్టీకి కాళేశ్వర కష్టం..ముందు నుయ్యి వెనుక గొయ్యి..అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా కొట్టే ఛాన్స్..

కారు పార్టీకి కాళేశ్వర కష్టం..ముందు నుయ్యి వెనుక గొయ్యి..అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా కొట్టే ఛాన్స్..
  • కేసీఆర్ సమాధానం లేకే రాలేదని న్యాయస్థానానికి చెప్పనున్న సర్కారు
  •  గొడవ చేస్తే చర్చ జరగనీయకుండా అడ్డుకున్నారని కోర్టుకు చెప్పే అవకాశం
  • ఇందుకు సంబంధించిన వీడియోలను కోర్టుకు అందించనున్న ప్రభుత్వం
  •  చర్చ జరగనిస్తే పార్టీ మనుగడకు తీవ్ర నష్టం వాటిల్లే చాన్స్
  •  కోర్టులో వేసిన పిటిషన్ గులాబీ పార్టీ మెడకు చుట్టుకుంటుందా.?

కేసీఆర్ మానస పుత్రి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎష్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.  కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా మారనుంది. ఈ సెషన్ కు ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై చర్చించాల్సిన బాధ్యతను ప్రధానంగా ఇరిగేషన్ మాజీ మినిస్టర్ హరీశ్ రావుకు అప్పగించారు. 

కాళే శ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ రావు ఇటీవలే హై కోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరిం చిన న్యాయస్థానం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత నివేదికను కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసింది, కాళేశ్వరం నివేదిక ను సభలో ప్రవే శపెట్టనుంది. తాను గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఆ రెండు కూడా బడ్జెట్ సెషన్స్ కావడం గమ నార్హం. రేపటి మీటింగ్ ప్రధానంగా కాళేశ్వరం కమిటీ నివేదికపైనే జరగనున్నందున కేసీఆర్ హాజరు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్

హాజరైతే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కమిషన్ నివేదికను వినిపించడంతోపాటు లోపాలను, డిజైనింగ్, ఇంజినీరింగ్ వైఫల్యాలను ఎండగ ట్టనుంది. దీంతో ఆయన డిఫెన్స్ లో పడిపోయే ప్రమాదం ఉందనే వాదన ప్రభుత్వం వైపు నుంచి ఉంది. గైర్హాజరయితే అవకతవకలపై సమాధానం చెప్పలేకే ముఖం చాటేశారంటూ హైకోర్టుకు ప్రభుత్వం నివేదించనుంది. ఈ పరి స్థితిని ముందుగానే ఊహించిన కేసీఆర్ అసెం బ్లీకి హాజరయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. కాళేశ్వరం నివేదిక పై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ చేస్తే చర్చ జరగనీయకుండా అడ్డుపడ్డారని తెలుపుతూ హైకోర్టుకు సర్కారు నివేదించే అవకాశం ఉంది. దీంతో పాటు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కింద వీడియోలను కూడా న్యాయస్థానానికి అందించనుంది.

అన్ని వేళ్లు కేసీఆర్ వైపే

కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ 600 పేజీల నివేదికను సమర్పించింది. ఇందులో  60 పేజీలకు బ్రీఫ్ చేసి మరో నివేదికను కూడా అధికారులతో కూడిన కమిటీ సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డిజైనింగ్, ఇంజినీరింగ్, నిర్మాణ లోపాలున్నాయని నివేదికలో పే ర్కొన్నట్టు సమాచారం. తానే డిజైన్ చేసి నట్టు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పదే పదే చెప్పిన కేసీఆర్.. కమిషన్ ముందు మాత్రం తప్పును ఇంజినీర్ల మీదకు నెట్టేశా రు. దీంతో కథ మొత్తం మారిపోయింది. అటు ఇంజినీర్లు మాత్రం అంతా కేసీఆర్ చెప్పినట్టే చేశామని అఫిడవిట్లు ఇవ్వడంతో పాటు కమిషన్ కు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలు, నిర్మాణ సంస్థలు, ఇంజినీర్లను విచారించి కమిషన్ ఈ నివేదికను సిద్ధం చేసింది. ఈ క్రమంలో అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపి స్తున్నాయి. వీటికి సమాధానం చెప్పుకొనేం దుకైనా కేసీఆర్ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన వచ్చి కమిషన్ రిపోర్టును విభేదించాలి. డిజైనింగ్ ను. ఇంజినీరింగ్ ను, నిర్మాణ నాణ్యతను సమ ర్జించుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో కాళేశ్వరం కమిషన్ నివేదిక లోపాలను ఎత్తి చూపాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అయిన కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అందుకే ఆ బాధ్యతను హరీశ్ కు అప్పగించారు. దీంతో అసెంబ్లీ వేదికగా ఏం జరగబోతోంది..? బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది.

►ALSO READ | నాకు పార్టీలతో పని లేదు.. మీకోసం పనిచేస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి