కాళేశ్వరం, పాలమూరు, సీతారామ పూర్తయితే వజ్రపుతునకే : కేసీఆర్

కాళేశ్వరం, పాలమూరు, సీతారామ పూర్తయితే వజ్రపుతునకే : కేసీఆర్

ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే.. హైదరాబాద్ అడ్డాపై కూలీ.. ఇప్పుడు ఇతర జిల్లాలనుంచి కూలీలు వచ్చి పనిచేస్తున్నారు. ఇది మారిన పాలమూరు ముఖచిత్రానికి నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. పాలమూరు పొంగు చూస్తే నా ఒళ్లు పులకరిస్తోంది.. ఈ ప్రాజెక్టుతో నా జన్మ ధన్యమైందన్నారు సీఎం. మహబూబ్ నగర్ కీర్తికిరీటలో ఈ ప్రగతి శాశ్వతమన్నారు సీఎం.

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మూడేళ్ల క్రితమే పూర్తయ్యేది.. పాలమూరును అడ్డుకుంది ఇక్కడి గత్తరబిత్తర లీడర్లే అని -కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎంపీగానే నేను తెలంగాణ సాధించానని.. 2001లో గులాజీ జెండా ఎగిరన తర్వాత తెలంగాణ కోసం గర్జించాం.. నేను గర్జించేదాకా జూరాల కింద ఇంచుకు నీళ్లియ్యలేదని అప్పటి పరిస్థితిని వివరించారు సీఎం -కేసీఆర్.ఉద్యమం కారణంగానే నాడు చంద్రబాబు జూరాలకు పరుగెత్తారని.. ఆర్డీఎస్ తూములు మూస్తే బాంబులతో బద్దలు కొడతామని బైరెడ్డి అన్నారు

తెలంగాణ వచ్చినంక సాగునీటి కోసం మూడు ప్రాజెక్టులను మొదలు పెట్టాం.  కాళేశ్వరం, సీతారామప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మించాలని నిర్ణయించాం. కాళేశ్వరం పూర్తియింది. సీతారామ ప్రాజెక్టు తుది దశలో ఉంది.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తియితే తెలంగాణ రాష్ట్రం వజ్రపు తునకే అవుతుందన్నారు సీఎం కేసీఆర్.

కొల్లాపూర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాలు 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై  వరాల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్. కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దికి రూ. 25కోట్ల నిధులు మంజూరు చేస్తున్న ట్లు ప్రకటించారు. ఈ ప్రాంతంలో అదనంగా చెక్ డ్యామ్ లు , 3 లిఫ్ట్ ఇరిగేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహబూబ్ నగర్ లో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.