Nag asghwin, Vijay devarakonda: నా ప్రతీ సినిమాలో విజయ్ ఉంటాడు.. ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదా!

Nag asghwin, Vijay devarakonda: నా ప్రతీ సినిమాలో విజయ్ ఉంటాడు.. ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదా!

కల్కి 2898 ఏడీ దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఫ్రెండ్ విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కల్కి సినిమాలో విజయ్ పాత్ర గురించి మాట్లాడుతూ.. నా ప్రతీ సినిమాలో విజయ్ ఉంటాడని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. 

హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ మైథాలజీ అండ్ స్కైఫై ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే రూ.700 కోట్లు కలెక్ట్ చేసి వసూళ్ల వరద పారిస్తోంది. ఇదిలా ఉంటే.. కల్కి సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ మహాభారతానికి లింక్ చేస్తూ తీసిన విషయం తెలిసిందే. అలా రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించారు. కానీ, అర్జునుడిగా విజయ్ ను తీసుకోవడంపై కొంతమంది నుండి నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. గెటప్ విషయంలో ఒకే అనిపించినా.. విజయ్ వాయిస్ విషయంలో తీవ్ర ట్రోల్ చేశారు.

అర్జునుడి లాంటి పవర్ఫుల్ పాత్రని విజయ్ కి ఇచ్చి కామెడీ చేశారు అంటూ కామెంట్స్ కూడా చేశారు. తాజాగా ఇదే విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ వద్ద ప్రస్తావించగా.. విజయ్ దేవరకొండ నా బెస్ట్ ఫ్రెండ్. నా సినిమాల్లో హీరోగా చేస్తే హ్యాపీ. కుదరకపోతే తన కోసం స్పెషల్ పాత్ర క్రియేట్ చేస్తాను. అలా.. నా ప్రతీ సినిమాలో విజయ్ ఉంటాడు.. అంటూ తమ స్నేహం గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు నాగి. అది చూసిన నెటిజన్స్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్రెండ్ షిప్ అంటే మీదే అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గతంలో నాగ్ అశ్విన్ తెరేక్కించిన ఎవడె సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల్లో కూడా విజయ్ నటించిన విషయం తెలిసిందే.