ఎంబీబీఎస్ ప్రవేశాల రిపోర్టింగ్ గడువు పొడిగింపు

ఎంబీబీఎస్ ప్రవేశాల రిపోర్టింగ్ గడువు పొడిగింపు

ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం (సెప్టెంబర్ 8వ తేదీ) సాయంత్రం వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం (సెప్టెంబర్ 7న) ప్రకటన విడుదల చేసింది. రెండో విడుత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పూర్తైన తర్వాత సెప్టెంబర్ 7వ తేదీని రిపోర్టింగ్ గడువుగా మొదట నిర్ణయించారు. గురువారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి రిపోర్టింగ్ గడువును పెంచాలని కోరారు. అంతేకాదు.. మెడికల్ కౌన్సిల్ కమిటీ(ఎంసీసీ) నిబంధనల ప్రకారం.. మూడో విడత కౌన్సెలింగ్ లోనూ అవకాశం కల్పించాలని, లేకపోతే తెలంగాణ విద్యార్థులకు నష్టం కలుగుతుందని వివరించారు.

విద్యార్థులపై అభ్యర్థనపై స్పందించిన మంత్రి హరీష్ రావు.. రెండో విడుత అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రెండో విడుత కౌన్సెలింగ్ సీటు సాధించిన విద్యార్థులకు రిపోర్టింగ్ గడువును సెప్టెంబర్ 8వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకు పెంచుతూ సంబంధిత ధ్రువపత్రాలతో కేటాయింపు జరిపిన కళాశాలల్లో రిపోర్టు చేయాలని తెలియజేశారు. 

రెండవ విడతలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులకు శుక్రవారం సాయంత్రం వరకు గడువు పొడగించాలని, మూడవ విడత కౌన్సిలింగ్  లో అవకాశం కలిపించాలని కాళోజి యూనివర్సిటీ ఉపకులపతిని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. యూనివర్సిటీ కళాశాలలో చేరేందుకు రేపటి  వరకు గడువు పొడిగించింది. మంత్రి ఆదేశాల మేరకు అభ్యర్థులకు మూడో విడత కౌన్సిలింగ్ లో అవకాశం కలిపిస్తామని కాళోజీ విశ్వవిద్యాలయం ప్రకటించింది.