ట్వంటీ ఇయర్స్ ఆఫ్ టుగెదర్ నెస్ అండ్ హ్యాపీనెస్

ట్వంటీ ఇయర్స్ ఆఫ్ టుగెదర్ నెస్ అండ్ హ్యాపీనెస్

నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవన్ పల్లి అనిల్ ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ లో వారిద్దరి కొడుకులతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ... తమ పెళ్లైయి 20ఏళ్ల అవుతుందని వ్యక్తమయ్యేలా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ టుగెదర్ నెస్ అండ్ హ్యాపీనెస్ అనే క్యాప్షన్ ను జతచేశారు. 2002 లో కల్వకుంట్ల కవిత, అనిల్ ల వివాహం జరగగా.. ఈ దంపతులకు ఆదిత్య, ఆర్య అనే ఇద్దరు కుమారులున్నారు. 

ఇకపోతే తెలంగాణ జాగృతి ద్వారా వెలుగులోకి వచ్చి.. 2014 లో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు కల్వకుంట్ల కవిత. 2019 ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసినా...  2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి, 2022 జనవరిలో రెండోసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ... పలువురికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ తనయగా మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు.