సంతోష్ రావు.. ఓ దుర్మార్గుడు, దయ్యం.. కల్వకుంట్ల కవిత

సంతోష్ రావు.. ఓ దుర్మార్గుడు, దయ్యం.. కల్వకుంట్ల కవిత

మాజీ రాజ్యసభ్యుడు, బీఆర్​ ఎస్​ నేత జోగినిపల్లి సంతోష్​ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ ఎస్​ పార్టీకి కార్యకర్తలు, నేతలు దూరమవడానికి కారణం సంతోష్​ రావే అని అన్నారు.  మొత్తం పార్టీలో  నాయకులు, కార్యకర్తలకు రక్తకన్నీరు పెట్టించిన మొట్టమొదటి దుర్మార్గుడు సంతోష్​ రావేనని కల్వకుంట్ల కవిత అరోపించారు.
  
బీఆర్​ ఎస్​ పార్టీకి , ఆ పార్టీ అధినేత కేసీఆర్​ కు ఉద్యమకారులు దూరం చేసిన మొదటి దయ్యం సంతోష్​ రావు అని ఆరోపించారు. కవిత. గద్దర్​ ను గేటుదగ్గర నిలబెట్టినా..ఈటెల రాజేందర్​  లాంటి ఉద్యమ నాయకులు బీఆర్​ ఎస్​ వీడటానికి కారణం సంతోష్​ రావే అన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డితో సంతోష్​ రావు అంటకాగుతున్నారని అన్నారు కల్వకుంట్ల కవిత. ఫాంహౌజ్​ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్​ ఏం తిన్నా. ఏం చేసినా.. సగం ఇండ్లి తిన్నాడా.. మొత్తం ఇండ్లి తిన్నాడా అన్న విషయాలతో సహా సమాచారం ఇచ్చేది సంతోష్​ రావేనని కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. 

ఇక సంతోష్​ రావుపై సిట్​ విచారణ జరుపుతామంటోంది.. సిట్​ పిలవడం బాగానే ఉందిగానీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది అనుమానంగా ఉందన్నారు. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్​ రావు, కేటీఆర్​ ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థంకావడం లేదన్నారు.చట్టం కరెక్టుగా పనిచేస్తే సంతోష్​ రావుకు శిక్ష ఖామని అన్నారు కల్వకుంట్ల కవిత.