కేసీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి : కల్వకుంట్ల సంజయ్

కేసీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి : కల్వకుంట్ల సంజయ్

జగిత్యాల, వెలుగు:  రాష్ట్ర సాధన లో సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకువచ్చారని, ఆయన స్ఫూర్తితో తో రాజకీయాల్లోకి వచ్చానని బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చెప్పారు. శుక్రవారం కోరుట్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ​హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్​కల్వకుంట్ల సంజయ్‌‌‌‌.. సీఎంతో కలిసి అభివాదం చేశారు. సంజయ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీలు చేస్తున్న ఆడబిడ్డలకు పెన్షన్ ఇచ్చిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు.

అలాగే అర్హులందరికీ కొత్త పింఛన్లు ఇవ్వాలని సీఎంను కోరారు.  సర్కార్ ఏర్పాటయ్యాక మెట్‌‌‌‌పల్లి, కోరుట్లలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ కాలేజీలతోపాటు హర్టికల్చర్ కాలేజీ లు మంజూరు చేయాలని సీఎంకు విన్నవించారు. ఈ గడ్డ మీద పుట్టిన తనను ఆశీర్వదించాలని సంజయ్ ​ప్రజలను కోరారు. అనంతరం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు మెట్ పల్లి పట్టణానికి చెందిన నజిమా బేగం జామిన్(దట్టి) కట్టారు. ఈ సందర్భంగా మెట్‌‌‌‌పల్లి కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఖుతుబొద్దిన్ పాషా, ప్లంబర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జావిద్ బీఆర్ఎస్‌‌‌‌లో చేరారు. సభలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, రాజ్యసభ సభ్యుడు దామోదర్‌‌‌‌‌‌‌‌రావు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.