రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుపడ్డ విద్యుత్ ఏఈ

 రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుపడ్డ విద్యుత్ ఏఈ

కొత్త వెంచర్లలో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు లంచం డిమాండ్
నాగర్ కర్నూల్:
కల్వకుర్తి విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రియల్టర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్న కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ సురేష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల దాడులు, సోదాలు జరపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.  
కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామం వద్ద రెండు కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్లలలో విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు, కొత్త  లైన్ల ఏర్పాటు కోసం హైదరాబాద్ కు చెందిన ప్రభాకర్‌ అనే కాంట్రాక్టర్‌ను సంప్రదించాడు. ఎన్నిసార్లు తిరిగినా ఎలాంటి పురోగతి లేకపోవడంపై ప్రశ్నించగా డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు లక్ష రూపాయలు ఇస్తేనే పనిజరుగుతుందని తేల్చి చెప్పడంతో రియల్టర్ ఏసీబీ అధికారుల‌ను సంప్రదించగా.. వారు ఇచ్చిన రూ.1 లక్ష తీసుకుని ఇవాళ సాయంత్రం 5:30 గంట‌ల‌కు ఇస్తుండ‌గా ఏసీబీ అధికారులు అదే సమయంలో దాడి చేసి ప‌ట్టుకున్నారు. ఆయన అక్రమ సంపాదన ఆస్తులపై కూడా సోదాలు చేస్తున్నారు. రేపు హైదరాబాద్‌ స్పెషల్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ అధికార వర్గాల సమాచారం. 

 

 

ఇవి కూడా చదవండి

కేంద్రం రెడీ.. రాష్ట్రాలే సుముఖంగా లేవు

జిల్లాకో నర్సింగ్ కాలేజీ కట్టాలని నిర్ణయం

తెలుగు అకాడమీ విభజన కేసు పిటిషన్ వెనక్కి