తెలుగు అకాడమీ విభజన కేసు పిటిషన్ వెనక్కి

తెలుగు అకాడమీ విభజన కేసు పిటిషన్ వెనక్కి
  • తెలంగాణకు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: తెలుగు అకాడమీ విభజన కేసులో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు అనుమతిచ్చింది సుప్రీం కోర్టు. తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీకి చెల్లించాల్సిన డబ్బుల్లో ఇప్పటికే 90 కోట్లు చెల్లించామంది తెలంగాణ ప్రభుత్వం. మిగతా 30 కోట్లు వారంలోగా చెల్లించాలని ఆదేశించింది. తెలుగు అకాడమీకి సంబంధించి 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు నెల రోజుల టైమ్ ఇచ్చింది. ఈ కేసును విచారించిన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమాకోర్టీ ధర్మాసనం.. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. నెల రోజుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఆదేశించింది.

 

 

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ ఎజెండా లేకుండా సమావేశం నిర్వహిస్తే స్వాగతిస్తాం

కేటీఆర్ కామెంట్స్కు ఏపీ మంత్రుల కౌంటర్

అవసరం లేకపోయినా సిజేరియన్లు చేయొద్దు 

దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్