ఆమనగల్లు ప్రభుత్వ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలి : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు ప్రభుత్వ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలి : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు :  ఆమనగల్లు ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవనాన్ని ఈ నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులను, కాంట్రాక్టర్‌‌‌‌ను ఆదేశించారు. ఆదివారం ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు తలకొండపల్లి మండలం పడకల్లు గ్రామ మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లట్టుపల్లి నరహరి రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి నివాసంలో నివాళులర్పించారు.

నరహరి రెడ్డి ఐదు సార్లు సర్పంచ్ గా, పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, మార్కెట్ చైర్మన్ గా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని గుర్తుచేశారు. అనంతరం గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, నాయకులు ప్రభాకర్ రెడ్డి, గుర్రం కేశవులు, శ్రీనివాస్ రెడ్డి, మహేశ్, హలీమ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.