పాలమాకుల చెరువులో పడి బీటెక్ విద్యార్థి మృతి

పాలమాకుల చెరువులో పడి బీటెక్ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ మండలం పాలమాకుల చెరువులో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో పడి చనిపోయాడు. మృతుడు షాద్ నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామానికి చెందిన రాములు కుమారుడు కల్యాణ్ గా గుర్తించారు. బాట సింగారంలోని సెంటి మేరీ కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

పాలమాకుల చెరువులో దూకి కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఇంకా ఏమైనా జరిగిందా..? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే.. దారి తీసిన కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. కుమారుడు మృతితో కల్యాణ్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.