మూడు డిఫరెంట్ షేడ్స్‌‌లో కళ్యాణ్ రామ్

మూడు డిఫరెంట్ షేడ్స్‌‌లో కళ్యాణ్ రామ్

‘బింబిసార’తో ఇటీవల సూపర్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్.. మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘అమిగోస్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘అమిగోస్’ అనేది ఓ స్పానిష్ పదం. స్నేహితుడిని ఉద్దేశించి మాట్లాడేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇదొక యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ జరుగుతోంది. నిన్న ఫస్ట్ లుక్‌‌తో పాటు మూవీ రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్‌‌‌‌లో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌‌లో కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి ఇందులో తను ట్రిపుల్ రోల్‌‌ చేస్తున్నట్టు హింట్ ఇచ్చారు. ఆషిక రంగ‌‌నాథ్ హీరోయిన్‌‌గాన‌‌టిస్తోంది. బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాష్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.   ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల  చేయనున్నట్టు ప్రకటించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.