Devil OTT: డెవిల్‌ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Devil OTT: డెవిల్‌ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందించిన స్పై థ్రిల్లర్ ‘డెవిల్’(Devil). కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌గా కనిపించిన ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లో రిలీజ్ అయింది. బ్రిటీష్‌‌ వాళ్లు ఇండియాను ప‌‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌‌థ‌‌తో..ప్రేక్షకుల ముందుకు వచ్చిన డెవిల్ కు..ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. 

లేటెస్ట్గా డెవిల్ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్ అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జనవరి 14 నుంచి డెవిల్ సినిమా స్ట్రీమింగ్‌ కానుందని మేకర్స్ తెలిపారు. విడుదలైన రెండువారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుందన్నమాట. మరి ఓటీటీ ఆడియాన్స్ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.  

డెవిల్ కథ: 

ఈ సినిమాలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌గా డెవిల్ (కళ్యాణ్ రామ్) పాత్రలో కనిపించాడు.ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్‌ సుభాష్‌ చంద్రబోస్‌ను పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్లాన్ వేస్తుంది. అదే క్రమంలో బోస్ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదే క్రమంలో ర‌స‌పురంలోని జ‌మిందార్ ఇంట్లో జ‌రిగిన ఓ హ‌త్య కేసుని ఛేదించ‌డానికి ప్ర‌భుత్వం డెవిల్ ని పంపుతుంది.  కేసు దర్యాప్తులో సుభాష్ చంద్ర‌బోస్ నేతృత్వంలో న‌డుస్తున్న ఐఎన్ఏ (ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ) ఏజెంట్ల‌ను గుర్తిస్తాడు డెవిల్‌. మరోవైపు, బోస్.. తన కుడి భుజ‌మైన త్రివ‌ర్ణతో టచ్‌లో ఉన్న విష‌యాన్ని డెవిల్‌ ప‌సిగ‌డ‌తాడు. ఈ కేసు విచారణలో భాగంగా..ఆ ఊరికి వెళ్లి హత్యకేసు డీల్ చేయడం మొదలుపెడతాడు. అక్కడ డెవిల్కి విజయ కజిన్‌ నైషేద (సంయుక్త మీనన్‌)పై అనుమానం కలుగుతుంది. మరి డెవిల్ నిజంగానే మర్డర్ కేసుని చేధించడానికి ఆ ఊరికి వెళ్లాడా? లేక నేతాజీ రైట్ హ్యాండ్ త్రివర్ణని పట్టుకోవడానికి వెళ్లాడా? చివరికి బ్రిటిష్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ ఆచూకీ కనుక్కున్నారా?  ఈ కథలో చంద్ర‌బోస్ టీమ్‌లోని మ‌ణిమేఖ‌ల (మాళ‌వికా నాయ‌ర్‌) క్యారెక్టర్ ఏంటీ?  అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కింది.