డెవిల్లో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌గా.. కళ్యాణ్ రామ్

డెవిల్లో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌గా.. కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందించిన  స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ఇదొక పీరియాడికల్ డ్రామా.  బ్రిటీష్‌‌ వాళ్లు  ఇండియాను ప‌‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌‌థ‌‌తో తెర‌‌కెక్కిన సినిమా కావ‌‌టంతో నాటి ప‌‌రిస్థితుల‌‌ను ఆవిష్కరించేలా భారీగా సినిమాను చిత్రీక‌‌రించారు. అలాగే న‌‌టీన‌‌టులకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌‌ విషయంలోనూ భార‌‌తీయ‌‌త‌‌ను ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయనకు డిఫరెంట్ గెటప్స్‌‌ను డిజైన్ చేశారు కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్.  ధోతి, కుర్తా, బ్లేజర్‌‌‌‌తో పాటు పురాతన వాచీలతో ఇండియన్ కల్చర్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఇందులో కళ్యాణ్ రామ్  దాదాపు 90కి పైగా కాస్ట్యూమ్స్‌‌ను ఉపయోగించినట్టు చెప్పారు. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్స్‌‌గా నటించిన  ఈ  చిత్రానికి  శ్రీకాంత్ విస్సా కథ, మాటలు,  స్క్రీన్ ప్లే రాశాడు.

 హ‌‌ర్షవ‌‌ర్ధన్ రామేశ్వర్‌‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్రంలోని పాత్రలను పరిచయం చేసిన మేకర్స్.. సాంగ్స్, టీజర్‌‌‌‌తో సినిమాపై అంచనాలు పెంచారు. మంగళవారం ట్రైలర్ రాబోతోంది. డిసెంబర్ 29న సినిమా విడుదల కానుంది.