భద్రకాళి అమ్మవారికి చక్రస్నానం

భద్రకాళి అమ్మవారికి చక్రస్నానం

గ్రేటర్​వరంగల్, వెలుగు: కల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం భద్రకాళీ అమ్మవారికి చక్రస్నానం, ధ్వజారోహణం, పుష్ఫయాగాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా ముత్తైదువులు అభిషేకానికి పసుపుకొమ్ములు, సుగంధ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించారు. 

దేవాలయ ఈవో శేషు భారతి మాట్లాడుతూ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని, కార్యక్రమాలకు సహకరించిన ఆఫీసర్లకు, ప్రముఖులు, దాతలు, భక్తులు, కుల సంఘాలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. భద్రకాళీ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో చక్రస్నానం చేస్తున్న అర్చకులు