ఎమ్మెల్యేల వద్ద ఆగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అప్లికేషన్లు

ఎమ్మెల్యేల వద్ద ఆగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అప్లికేషన్లు

పెండింగ్‌లో పెండ్లిసాయం

నిజామాబాద్ జిల్లాలో సంతకాలు చేయడంలో లేట్

వారి చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు

నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరుపేదలకు పెండ్లిసాయం అందడంలో తీవ్ర జాప్యమవుతోంది. ఇందుకు సంబంధించిన చాలా అప్లికేషన్లు ఎమ్మెల్యేల వద్దే పెండింగ్ లో ఉన్నాయి. నిరుపేద తల్లిదండ్రులకు ఆడపిల్ల పెండ్లి చేయడం భారం కావద్దని రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీమ్ ల కింద రూ.1,00,116 చొప్పున ఇస్తోంది. కానీ అప్లై చేసుకున్న తర్వాత సాయం కోసం చాలారోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఆర్డీఓ, తహసీల్దార్ లెవల్ లో త్వరగా క్లియర్ అవుతున్నా ఎమ్మెల్యేల సంతకాల కోసం పడిగాపులు కాస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. అప్లికేషన్ తో అవసరమైన అన్ని డాక్యుమెంట్లు జతచేసినప్పటికీ ఎమ్మెల్యే సంతకం లేనిదే ఆఫీసర్లు ఫైనల్ చేయడంలేదు. దీంతో చాలామంది దరఖాస్తుదారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.

పెండింగ్ లో 3,036 అప్లికేషన్లు

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20‌‌20–21 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి కల్యాణలక్ష్మి అప్లికేషన్లు 1,378, షాదీముబారక్ అప్లికేషన్లు 440 ఎమ్మెల్యేల వద్ద పెండింగులో ఉన్నాయి. ఆర్డీవో, తహసీల్దార్ లెవల్స్ లో కలిపి కల్యాణలక్ష్మి అప్లికేషన్లు 1,051, షాదీముబారక్ అప్లికేషన్లు 167 ఉన్నాయి.

ఏడాదిగా ఎదురుచూపులే..

కల్యాణలక్ష్మి స్కీమ్ కింద బీసీ, ఈబీసీలు చాలామంది అప్లై చేసుకున్నారు. బడ్జెట్ తక్కువగా రిలీజ్ కావ డంతో ఏడాదిగా పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. బడ్జెట్ రిలీజైనప్పుడు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీల అప్లికేషన్లు తక్కువగా ఉండటంతో త్వరగా పైసలు అందుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ డివిజన్‍లో ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ ఉన్నప్పటికీ అప్లికేషన్లు ఎక్కువగా లేకపోగా, బీసీ, ఈబీసీ అప్లికేషన్లు ఆర్డీఓ లాగిన్ లో ఎక్కువగా ఉన్నప్పటికీ బడ్జెట్ లేదు.

ఈ ఇయర్ లో 17,933 అప్లికేషన్లు

జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‍ స్కీమ్ కింద 2‌‌-020–-21 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటివరకు 17,933 అప్లికేషన్లు వచ్చాయి. వీరిలో 12,818 మందికి మాత్రమే చెక్కులు అందాయి.

For More News..

సాగర్‌లో అభ్యర్థుల వేటలో ఆల్ పార్టీలు

రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్​తో గందరగోళం.. పొద్దంతా సర్వర్‌‌ తిప్పలు

60 ఏళ్లు దాటిన రైతులకు 3వేల పెన్షన్​ ఇచ్చే ఆలోచనలో కేంద్రం