హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్ మధ్య ఈ తేదీల్లో మరో పది సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్ మధ్య ఈ తేదీల్లో మరో పది సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అదనంగా మరో పది ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రైన్ నెంబర్.07475 రైలు హైదరాబాద్ నుంచి విజయవాడకు 11, 12, 13, 18, 19 తేదీల్లో వెళుతుంది.

ట్రైన్ నెంబర్.07476 రైలు.. విజయవాడ నుంచి హైదరాబాద్కు 10,11,12,17,19 తేదీల్లో వెళుతుందని.. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. అంతేకాదు.. 11, 12 తేదీల్లో హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్కు (ట్రైన్ నెంబర్.07473), 10, 11 తేదీల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్కు ((ట్రైన్ నెంబర్.07474) రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఇక.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఘన్ పూర్, కాజీపేట్, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే స్పెషల్ ట్రైన్ కూడా ఇవే రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

►ALSO READ | విజయవాడ దుర్గ గుడిలో భక్తులకు కరెంట్ షాక్

హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లే స్పెషల్ ట్రైన్.. సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగామ, ఘన్ పూర్, కాజీపేట్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చే స్పెషల్ ట్రైన్స్ కూడా ఇవే రైల్వే స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.