విజయవాడ దుర్గ గుడిలో భక్తులకు కరెంట్ షాక్

విజయవాడ దుర్గ గుడిలో భక్తులకు కరెంట్ షాక్

విజయవాడ దుర్గ గుడిలో అతి పెద్ద ఘోర ప్రమాదం తప్పింది. అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చే భక్తులకు ప్రసాదం అందిస్తారు పూజారులు. సరిగ్గా ప్రసాద వితరణ కేంద్రం దగ్గర.. భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. కొంత మంది భక్తులు కరెంట్ షాక్ కొడుతుంది అంటూ కేకలు వేస్తూ పరుగులు తీశారు. 

వెంటనే అప్రమత్తం అయిన ఆలయ సిబ్బంది, అధికారులు కరెంట్ ఆఫ్ చేశారు. ఆలయానికి కరెంట్ సరఫరా అయ్యే మెయిన్ స్విచ్ ఆప్ చేసేశారు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. ఆ వెంటనే ఆలయంలోని ఎలక్ట్రిషీయిన్స్, అధికారులు కరెంట్ షాక్ కొట్టిన ప్రాంతంలోని కరెంట్ వైర్లను పరిశీలించారు. 

ఆలయంలో కరెంట్ సరఫరా నిలిపివేసి.. ప్రసాద వితరణ చేశారు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఎక్కడ అయితే కరెంట్ షాక్ కొట్టింది అని భక్తులు చెప్పారో.. ఆ ప్రాంతం మొత్తంలో కరెంట్ వైర్లను సరిచేస్తున్నారు అధికారులు. వీకెండ్ శనివారం.. సంక్రాంతి సెలవులు కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలోనే ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఇలా జరగటం కలకలం రేపింది. 

కరెంట్ షాక్ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని దుర్గ గుడి ఆలయ అధికారులు వెల్లడించారు. కరెంట్ వైర్లను సరిచేసి.. కరెంట్ ఆన్ చేస్తామని స్పష్టం చేశారు అధికారులు.