
సంతోష్ శోభన్ హీరోగా అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం ‘కళ్యాణం కమనీయం’. కోలీవుడ్ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. శుక్రవారం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్లెజెంట్ విజువల్స్‌తో శ్రావణ్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంతోష్, ప్రియ సోఫాలో ఎదురెదురుగా కూర్చొని ఒకరి పాదాలు మరొకరు పట్టుకుని కనిపిస్తున్నారు. చుట్టూ గ్రీనరీతో ఉన్న ఈ పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’తో పాటు విజయ్ ‘వారసుడు’ విడుదలవుతున్నాయి.
వీటిమధ్య దీన్ని రిలీజ్ చేయడం విశేషం.