‘కొత్త లోక’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్.. తాజాగా తమిళంలో ఓ కొత్త సినిమాకు సైన్ చేసింది. మాయ, మానగరం, బ్లాక్ లాంటి ఆరు సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసిన పొటెన్షియల్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ధీరవియం ఎస్‌ఎన్ దీనికి దర్శకుడు. ‘నాన్ మహాన్ అల్లా’ ఫేమ్ దేవదర్శిని, వినోద్ కిషన్ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు.
బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, పి. గోపీనాథ్, తంగ ప్రభహరన్ ఆర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మరో 2 తమిళ చిత్రాల్లో కళ్యాణి నటిస్తోంది.
