ప్రభుత్వ పథకాల అమలులో ఆర్పీలు కీలకం: మంత్రి గంగుల

ప్రభుత్వ పథకాల అమలులో ఆర్పీలు కీలకం: మంత్రి గంగుల
  •   చీరల పంపిణీ చేసిన మంత్రి గంగుల 

కరీంనగర్ టౌన్, వెలుగు:  ప్రభుత్వ పథకాల అమలులో ఆర్పీలు కీలకమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల ఆర్పీలు, వీవోలు 221 మందికి సొంత ఖర్చుతో చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్ని గౌరవించుకోవడం మన సంప్రదాయమని స్పష్టం చేశారు.

 ఆర్పీలకు రూ. 2014కు ముందు రూ.200ఉన్న జీతాన్ని సీఎం కేసీఆర్​రూ.4వేలకు పెంచారన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల్ని ఇస్తున్నామన్నారు. సమైక్య పాలనలో కరీంనగర్‌‌కు మానేరు నది ఉన్నా ట్యాంకులతో నీళ్లు తెచ్చుకునేవాళ్లమని గుర్తు చేశారు. ప్రస్తుతం సిటీలో డెయిలీ వాటర్ సప్లై జరుగుతోందని, త్వరలో 24/7 తాగునీటిని సప్లై చేసేందుకు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. 

కల్యాణోత్సవాన్ని సక్సెస్​ చేయాలి

బుధవారం టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర దేవాలయానికి భూమిపూజతోపాటు సాయంత్రం నిర్వహించనున్న శ్రీనివాసుని కల్యాణ వేడుకలను సిటీవాసులు సక్సెస్​చేయాలని మంత్రి కోరారు. అంతకుముందు మానేర్ రివర్ ఫ్రంట్ పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, ఎంపీపీ టి.లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జడ్పీటీసీ కరుణ, కార్పొరేటర్లు వేణు, మాధవి, రమణారావు, ఐలేందర్ యాదవ్ పాల్గొన్నారు.